AP Fiber: ఫైబర్ నెట్ నుంచి 410మందిని తొలగిస్తున్నాం: చైర్మన్ జీవీరెడ్డి 12 d ago
ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మందిని తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో అక్రమ నియామకాలు చేసారని, ఎక్కువ మంది అవసరం లేకున్నా నియమించారని ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ వైఖరితో ఫైబర్‌నెట్ దివాలా అంచుకు చేరిందని చెప్పారు. మేం కక్షతో, దురుద్దేశంతో ఉద్యోగులను తొలగించడం లేదని, ఉద్యోగులకు లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరతామని తెలిపారు. మరో 200 మంది ఉద్యోగుల నియామక పత్రాలను పరిశీలిస్తున్నామని చైర్మన్ జీవీరెడ్డి పేర్కొన్నారు.